Non Duality

Non Duality

మౌనం అనేది మూడురకాల
మాటలు లేనప్పుడు శబ్దం ఉండదు అది మొదటి రకం మౌనం
భౌతికమయిన మౌనం అనచ్చేమో

రెండు ఆలోచనల మధ్య ఉండే కాళీ ఒక రకమయిన మౌనం
దీన్నే ఒక సున్నితమయిన సైలెన్స్ అనవచ్చేమో

ఆ కాళీలోంచి ఎప్పటికి మారని అవిరళ మౌనం అవిచ్చిన్నమయిన వర్తమానంగా ఉండొచ్చు
ఆ వర్తమానం మనస్సుతో బుద్ధి తో తెలుసుకోలేము.

బుద్ధి మరియు చిత్తం ,మనసు లేన్నప్పుడు ఉండేదే అప్రయత్నమయిన వర్తమాన అనుభూతి.

వర్తమాన అనుభూతి వస్తుగతం కాదు కాబట్టే మనస్సు, బుద్ధి వస్తువు కానటువంటి దాన్ని అవగాహనా చేసుకోలేదు. అది ఒక ఆందోళనకు గురిఅవుతుంది. అది తన స్వాభావిక కార్యక్రమానికి వ్యతిరేకమైంది కాబట్టి తిరుగుబాటు చేస్తుంది.

మరి, బుద్ధి, మేధస్సు తో కాక మరిదేనితో దాన్ని తెలుసుకో వచ్చు
అక్కడ తెలుసుకొనేది ఏమిలేదు. మనసు, బుద్ది ఆలోచనలు లేనప్పుడు ఉండేదే అది.అది ఎప్పుడు నీతోటె ఉంటుంది . అది, నీవు అనే రెండు లేవు. నీవే అది . అదే నీవు.

అది వస్తుగతం కానందున అక్కడ గ్రహించే వాడుకూడా ఉండదు. ఉండేది అది ఒక్కటే.
అనుభవాగ్రహీత లేడు. ఉండేది అనుభవమొక్కటే. నీవే అది. అదే వివరించరాని నిజస్వరూపం. అదే సత్యం , శివమ్.

Leave a Reply

Your email address will not be published.

Note : Comments may be edited for moderation and clarity