కవి (రచయిత) రైల్లో వెళుతుంటాడు ముగ్గురు బిచ్చగాళ్లను చూస్తాడు. ధర్మం చేయమని వాళ్ళు అడుక్కుంటుంటారు.
మనమెప్పుడు మన జీవితంలో యాచకులను చూసి అనుకుంటున్నట్టు ”బలిసినట్టున్నావు పని చేసుకోవచ్చుకదా” అంటాడు
ఆ ముగ్గురిలో ఒకడు ”పని చూపించు, దొరవు వచ్చావు” అని సమాధానం ఇస్తాడు .
ఇంత వరకు మనకు మన అనుభవం , ఊహకు అందే విషయం లాగానే ఉంటుంది
తరువాతి కథ కాస్మొలజీలోలా వొర్మహోల్ ద్వారా ఇంకొక ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది
కవి ‘పని చేసుకో రాదు’ అనడం , తాను ఎప్పటికయినా రాజు (డిప్యూటీ కలెక్టరు) అయిపోతాను
లాంటి కలల లొంచ్చి పుట్టింది . బిచ్చగాళ్ళు అతన్ని ఉరిమినట్టు చూస్తుంటారు . ఇదెక్కడి తద్దినంరా అని కవి ఊరకుండిపోయి తప్పించుకుంటాడు. తరువాత వాళ్ళు అప్పుడప్పుడు కనిపించేవాళ్ళు కానీ కవిని ఎప్పుడు బిక్షమడిగేవారు కాదు. వాళ్ళ నడక నడతలు దర్జాగా ఉండేవి.
పది ఏళ్ళు గడచి పోతాయి. కవి డిప్యూటీ కలెక్టర్ కాలేక పోతాడు.
కాలానుగుణంగా, వయస్సు రీత్యా కవి దృక్పధం లో మార్పు వస్తుంది. వాళ్ళు చేసేది న్యాయమయిన వృత్తే కదా. అందులో ఎవరికి అపకారం లేదు కదా, దైన్యంతో ధర్మం చేయండని అడుగుతున్నారు . బలవంతపెట్టడం లేదు కదా అనుకుంటాడు. బ్రతుకు తెరువు కోసం సాటి మనుషులు చేసే పనిలాగే వాళ్ళు చేస్తున్నారు అనిపిస్తుంది.
వాళ్ళను కలిసి ఒకసారి వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలి అనుకుంటాడు. తన రచనలకి ఉపకరిస్తుందనుకుంటాడు
ఒక రోజు రాత్రి సినిమా చూసి ఇంటికి వస్తుంటే ఒక ఇంటి దగ్గర నలుగురు నిలబడి ఉంటారు. వాళ్ళ తరహా చూస్తూ ఉంటే అక్కడేదో దెబ్బలాట జరిగి సద్దు మణిగినట్టుంది. సందు చివర ఉన్న రక్షకభటుడు ఏమి కల్పించుకున్నట్టు లేదు. వాడు నియంత్రిస్తున్నాడా లేక సంరక్షణ కల్పిస్తున్నాడా అనేది చెప్పడం కష్టం.
వాళ్లలో ఆ ముగ్గురు బిచ్చగాళ్ళలో ఒకడు కనిపిస్తాడు. ‘నువ్విక్కడే ఉంటావా’ అని అడుగుతాడు. వాడు తిరస్కారంగా హూఁ అంటాడు.
తాను కవినని , వాళ్ళ చరిత్ర తెలుసుకొని ఏదో రాసుకోవాలి ఉందంటాడు. వాడు రేపు రా అంటాడు.
కవి ఇంటికి వెళ్లి పోతాడు. వాడు కవిని ఇంటివరకు వెంబడిస్తాడు. సాయంత్రం లైబ్రరీకి వెళ్ళినప్పుడు ఎవడో తెలియని ఒకడు అనుసరిస్తూ ఉంటాడు. వెనకే తచ్చాడుతుంటాడు. తాను స్నేహితులతో ఏమిమాట్లాడుతున్నాడో వినడానికి తిరుగుతున్నాడని అనిపిస్తుంది.
దీని సారాంశము ఏమంటే నిజంగా తాను రచయితేనా అని కూపీ లాగు తుంటారు.
చివరకు ఆ మరుసటి రోజు కవి వాళ్ళను కలుస్తాడు. ఆ ముగ్గురిలో బుగ్గన్న. రంగన్న మంత్రులు సింగన్న రాజు.
వీళ్ళు రాజులు మంత్రులు ఏమిటి అనుకోవచ్చు . వీళ్ళు మనకు తెలియని పాతాళం లో ఉన్న ఒక వ్యవస్థ లో భాగం
బుగ్గన్న తన అధినాయకుని అనుమతి తీసుకొని ఈ ఇంటర్వూ ఇస్తాడు. కథ రాసి , వారికీ వినిపించి , అది వారికీ నచ్చితేనే వారి అనుమతి అంగీకారం తీసుకొని ప్రచురించుకోవాలంటాడు. నాయకుడు మొదట ఒప్పుకోలేదు కానీ ఏదో నాలుగు రాళ్ళూ సంపాదించుకుంటాడు అని ఒక దయాగుణం తో వాళ్ళ చరిత్ర చెప్పుతున్నానంటాడు.
బుగ్గన్న చరిత్ర: ఒక ధనవంతుడు. చిల్లరగా తిరిగి అంతా పోగొట్టుకుంటాడు. తన బంధువులందరూ గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తుంటారు. ఒక సారి రైలు ప్రమాదంలో గాయపడతాడు . చేయి పోతుంది. జ్ఞాపక శక్తి పోతుంది. బిచ్చమెత్తుకొని బ్రతుకుతాడు. ఒక ఏడాది తరువాత స్మృతి కలుగు తుంది. ఊరికెళ్ళి చూస్తే ఆస్థి అంతా అన్యాక్రాంతం అవుతుంది. ఏదో ఉద్యోగం చేసుకొని బతకొచ్చు కానీ భిక్షమే సుఖమనిపిస్తుంది.
బిక్షం అవమానకరం, తిడతారు అంటే. బిక్షం ఎత్తుకునేటప్పుడు కాదు. తరువాత సుఖం ఉంటుంది. దుఃఖం అంటదు. రాజకీయ నాయకుడు ఓట్లాడుక్కునేటప్పుడు కాదు గెలించినతరువాత సుఖం ఉంటుంది అంటాడు.
బుగ్గన్న ఇంకా ఇలా అంటాడు ;
తమ ప్రపంచంలో బీద వాళ్ళు, గొప్ప వాళ్ళు, పలుకుబడి గల వాళ్ళు అందరూ ఉంటారు. తాము కూడా తహసీల్(సుంకం) కట్టాల్సి ఉంటుంది. సంపద లో ఆరో భాగం సంఘానికి ఇవ్వాల్సిఉంటుంది . వాళ్లలో ఉండే అధికారులు అవి వసూలు చేస్తుంటారని, అన్ని జిల్లాలో అధికారులు ఉంటారు . ప్రతి 1 – 2 ఏళ్లకొకసారి అందరూ రాజులు కలుసుకుంటారు. తమది తుపాకులు లేని శాంతి రాజ్యం.
కొన్ని విషయాలను సంపూర్ణంగా తెలుసుకోవడానికి కొన్ని కష్టమైన ప్రశ్నలు వేస్తుంటే, రంగన్నని కలవమన్నాడు.
రంగన్న పెద్ద కవి పాటగాడు . బిచ్చగా ళ్ళు పాడే పాటల్లో ఎక్కువ శాతం అతను రాసిన పాటలే
శివరాత్రికి గట్టుమీద మధ్య వందలాది మంది మధ్య పాడుతుంటాడు అని బుగ్గన కవికి చెప్తాడు
కవి రంగన్నను కలుస్తాడు
రంగన్నతన గురించి చెప్తాడు: తల్లి తండ్రులు లేని అనాధ. ఎలాగోలాగా బ్రతకటం నేర్చుకుంటాడు. దొంగతనాలు మాత్రం చేయడు. ఒక పండితుని ఇంట్లో పనివాడిగా ఉంటూ రామాయణ మహా భారతాలన్నీనేర్చుకుంటాడు ఎవడో ఒకడు పొరపాటున దొంగనుకొని చేయి నరుకుతాడు. బిక్షాటన మొదలుపెడతాడు. ఒక ఆరవ బిచ్చగాడితో స్నేహమయి దక్షిణ భారతమంతా తిరుగుతాడు. దేవాలయాల ముందు అడుక్కుంటూ చాల తత్వాలు నేర్చుకుంటాడు . పోలీస్ వాళ్ళు రైళ్ళక్కనీయనందుకు వాళ్ళ మీద మహా కక్షగా ఉంటాడు. ఇప్పుడు ఆ కక్ష తీర్చుకుంటున్నానంటాడు. రంగన్న చాల విషయాలు చెప్తాడు .
మరో పదేళ్లు గడిచిపోతాయి. తాను రాయాలన్న కథ పూర్తికాదు, అందువల్ల వాళ్ళను మళ్ళీ కలుస్తాడు
బుగ్గన్న చెప్తాడు:
ఇప్పుడు నేనే చక్రవర్తి. ఇప్పుడు ఇంటర్వూలకి ఎవరి అనుమతి అవసరం లేదు . మీ రక్షక భటులు అంతా మా చేతుల్లో ఉంటారు.
మాకు సంబంధం ఉన్న దొంగతనాలేవీ కోర్టులకు రావు.
కోర్టుల్లోకి వచ్చినవాటిల్లో ఎవరన్నా సహాయం అర్థిస్తే శిక్షలను మేమే నిర్ణయిస్తాం.
మీరు రెండుసార్లు చిక్కులో పడ్డారు . ఒక సారి ఒక రాత్రి పోలీస్ జైల్లో పెట్టాల్సి వచ్చింది. విడిపించింది మేమే . దేశంలో జరిగే ఉద్యమాలన్ని మేమే నిర్వహిస్తాము.
ఒక్కడ్ని పిలిచి వాడితో గొడవలు ఎలా సృష్టిస్తారో చెప్పిస్తాడు . ఒక సమావేశాన్ని వాళ్ళ బంట్లయినా పోలీసులతో భగ్నం చేయిస్తారు ఉద్యమం పెరుగుతుంది . ఉద్యమానికి డబ్బిచ్చి పెంచుతాం
ప్రజలు , రాచరికంలో ఒక విభాగానికి తగాదా పెంచుతాం
దీంట్లో నీకేంటి లాభం అని కవి అమాయకంగా అడుగుతాడు కవి
అధికారులు తమ చేతుల్లో ఉంచుకుంటాం లేకపోతే అధికారం పై పట్టు కోల్పోతాం అప్పుడప్పుడు రక్షకభటులు అదుపు తప్పుతుంటే మేమట్లా చేస్తుంటాం
సంఘంలో ఎవడైనా జైలుకు వెళితే ఎవడైనా అధికారి మాట వినకుండా మా వాళ్ళను జైల్లో పెడితే వారి కుటుంబానికి నెలనెలా డబ్బులిస్తాం
ఇది అందరికీ, నాకు తెలియడం, నీకు భయంగా లేదా. నేను ఎవరికీ చెప్పను అని అనుకునే ధీమా ఏమిటని అంటాడు కవి.
ఇక్కడ నుంచి నీ వాళ్ళ కోసం సిఫార్సులు మేమే చెయ్యాలి కదా అంటాడు. నీ అవసరం అంటాడు
చివరగా తమ ఆచరణ వెనుక ఉన్న తర్కం, తత్వం, వాదం, భావనలు అన్నీ వివరిస్తాడు. దార్శనికతను తెలియపరుస్తాడు ,
సన్యాసులు, రాజకీయ నాయకులు అందరూ బిచ్చగాళ్లు.
వీరబ్రహ్మం, వేమన్న , శంకరుడు అందరూ సన్నాసులు అంటే బిచ్చగాళ్లు
వాళ్లే రాజుల ద్వారా రాజ్యాలను పాలించే బిచ్చగాళ్ళు
లోకంలో రెండు రకాల మనుషులు.
ఒక రకం సంసారులు
రెండవ రకం బిచ్చగాళ్ళు
అధికారులు , సన్యాసుల , మత గురువులు, రాజకీయవేత్తలు , కవులు గాయకులు వీళ్ళకి సంసారాలు చట్టుబండలు ఉండవు.
పెళ్ళాం పిల్లలంటే జంతు ధర్మం
ఆత్మ దర్శనమే బిచ్చగాని తనం
న్యాయంగా సంపాదించుకుని తినడం . లోకాన్ని ఉద్దరిస్తానని అని అనుకోక పోవడం సంసారుల లక్షణం. ఎవరు చెప్పినా వింటారు.
వీళ్ళ మీద పడి తినేవాళ్ళు బిచ్చగాళ్ళు.
సంసారానికి చాలామంది పనికిరారు వాళ్ళందరూ బిచ్చగాళ్ళు అవుతారు . వాళ్లని బిచ్చగాళ్లను చేసి వాళ్ళతో ఉద్యమాలను నిర్వహిస్తాం.
వాడు బిచ్చగాడు అని ఒప్పుకోడు అధికారం, లోకాద్ధారణ అనే ఆశలు చూపిస్తాం. సంసారులు మేకలు. బిచ్చగాళ్ళు తోడేళ్ళు.
కవి అనుకుంటాడు, బుగ్గన్న చెప్పేవన్నీ ఒక మూల సిద్ధాంతం నుండే వస్తున్నాయి అని .
చివరగా కవి, అతను చెప్పింది నిజాంకాదని అనుకోలేకపోతున్నాను అంటాడు.
రచయిత,రచన ఎలా చెయ్యాలి అనేది, ఒక పాత్రతో చెప్పిస్తాడు. బుగ్గన, కవికి చరిత్ర ఎలా మొదలు పెట్టాలి. ఎలా ముగించాలి . ఎక్కువ చెప్పకూడదు . తక్కువ చెప్పకూడదు అని చెప్పిస్తాడు. అన్ని విషయాలు ఒక మూల సూత్రం నుండి ఉద్భవించాలి, అని కవి, స్వగతంలో ఒక మాట అంటాడు
ముగ్గురు బిచ్చగాళ్ళు కథ ఆసాంతం ఒక ఉత్కంఠ, ఒక దార్శనికత , యధార్ధాలను కలిగి ఉంటాయి.
ఈ రోజు చూస్థున్న, బొంబాయి లో ఉండే D గ్యాంగు మాఫియాలు , వ్యవస్థీకృత పక్షపాత మీడియాలు, డీప్ స్టేట్(రాజ్యంలో ఉన్న అంతర్గత శక్తులు సముదాయం) , వాల్ స్ట్రీట్ , జార్జ్ సోరోస్ డబ్బిచ్చి నడిపే ఉద్యమాలు, రాచరికంలాగా ఉన్న అధికార వ్యవస్థ చుట్టూ ఉన్న పరిజనం, వాళ్ళు సమాజంపై పన్నే ఉచ్చులు, వలలు అన్నీ ఈ కథ చదువుతుంటే అర్ధమవుతాయి.
విశ్వనాథ సత్యనారాయణ గారి పరిశోధన, జ్ఞానం ,జాతీయత, సిద్ధాంత- సూత్రానుగత రచన పాటవం అమోఘం . సామాజిక వ్యవస్థ మీద ఉన్నస్టేటస్ కోయిస్ట్ భావజాలం (యధాతథ వాదం) ‘మ్యాక్లి దుర్గం లో కుక్క’ అనే కథ లో కనిపిస్తుంది . అది మినహాయిస్తే నోబెల్ బహుమతి కి అర్హుడు. రబింద్రనాథ్ టాగోర్ కు ఏ మాత్రం తీసిపోడు
Leave a Reply