నెట్ లేని రోజుల్లో

నెట్ లేని రోజుల్లో

నెట్ లేని రోజుల్లో

బాల్యం
కృంగదీసే గతం ఉండేది కాదు
భవిష్యత్తు భయపెట్టేది కాదు

ఇల్లు , కుటుంబాల వెచ్చదనం
పెట్టని కోటల్లాంటి అమ్మలు నాన్నలు
గడప దాటితే స్నేహితులే స్నేహితులు

రక రకాల ఆటలు
రాత్రి కరంటు పోతే
బయటి కొచ్చి అడుకోవచ్చనే
ఆనందంలో అరుపులు

గంటలకొద్ది పరిసర వీధుల్లో గడపడం
వైల కొద్ది గంటలు
ఏం మాట్లాడుకునేవాళ్ళమో
ఆ దేవుడికే తెలుసు
ఇంటర్నెట్ లేని రోజులు

ఆ రోజులు ఇక రావేమో
ఏ తరానికి ఆ తరం
ఇలానే అనుకుంటుందేమో

తరచి చూస్తే నాకనిపిస్తుంది
ఆనందం బాల్యంలో కాదు
భవిష్యత్తు , భూతకాలం లేని
వర్తమానం లో నివసించడమే

అదే బాల్యం
అదే స్వర్గం
అదే సర్వస్వం

Leave a Reply

Your email address will not be published.

Note : Comments may be edited for moderation and clarity